Tuesday, March 22, 2011

యువతా !

మీడియా అంటే ఒక ఆయుధం !!

మీడియా అంటే ఒక సమున్నత శక్తి..!!!

మీడియా అంటే ఒక స్ఫూర్తి..!!!!

మీడియా అంటే ఒక చైతన్యం..!!!!



............

వ్యాపారాన్ని అభివృధ్హి చేయాలంటే

వ్యాపార ప్రకటనలు ఉండాలి

టివి కార్యక్రమాలు సజావుగా సాగాలంటే

యాడ్స్ చూపించాల్సిందే..

కాని....



దానికోసం

వనితలను వ్యాపార వస్తువులుగా

చూపించటం బాగాలేదు

బాడీ స్ప్రే యాడ్ చూస్తుంటే

చూడాలంటే సిగ్గు వేస్తుంది...

వనిత వ్యక్తిత్వాన్ని ఒక స్ప్రే బాటిల్ కన్నా

హీనం చేసే ఇటువంటి

యాడ్స్ ని !నిషేధించండి !!

వీలు చేసుకుని మరీ పోరాడండి..!

సెన్సార్ బోర్డు అనేది ఉందా

అని నిలదీయండి..!!!



భర్త కన్నా..టీచర్ వృత్తి కన్నా ...

తన వ్యక్తిత్వం కన్నా... బాడి స్ప్రే కి

పరవశించి పోయే పడతులుగా

నటిస్తున్న నటీమణులకు

అది తప్పని తెలియ చెప్పేలా

యువతా! ఏదో ఒకటి చేయండి ప్లీజ్!!!!

Labels: యువతా

Monday, July 13, 2009

సుమంగళి {మూడవ కవిత .అతివ-అంతర్మధనం)

వివాహ బంధమంటే
ఆత్మవంచన ముసుగులో
అభిమానపు అపహాస్యం

నూరేళ్ళ నడకకు
అడుగడుగునా స్పీడు బ్రేకర్లు

మూడుముళ్ల జీవితానికి
నలుగుతున్న అనుబంధం

కన్నపేగు రుణానికి
కాలుతున్న మానవత్వం

సుమంగళిగా మిగలాలని
నడుస్తున్న నిప్పుల కుంపటి

సంస్కరించాలంటే ......................?
అణువణువున అల్లుకుపోయిన
సంప్రదాయపు చితిమంటల్లో
నిత్యాహుతిగా వెలుగుతూ
సమిధలా కాలిపోతూ కూడా
కరిగిపోతున్న బంధానికి ,అడ్డుకట్ట వేసి

త్యాగం,సహనం,అనే ముండ్ల కిరీటంతో
రక్తసిక్తమైన మనసుతో
రగిలిపోతున్నా కూడా

ఆనందాన్ని, సంతృప్తిని
అతికష్టంగా నటిస్తూ
మగడు ఆడిస్తున్న
సంసార రంగస్థలిపై
ఎన్నిరోజులీ నటన..?




Wednesday, July 8, 2009

అతివ-అంతర్మధనం

వ్యాఖ్యానం :- సృష్టికి మూలం స్త్రీ!ఆమె శక్తి స్వరూపిణి!!సహనం, త్యాగం మూర్తీభవించిన మమతల పందిరి, అనురాగవల్లి!!!!

ఇలా వ్రాస్తూ పోతువుంటే ఎన్నో ఎన్నెన్నో పదాలు వస్తూనే వుంటాయి. కాని నాణానికి బొమ్మా-బొరుసు వున్నట్టుగానే స్త్రీకి ఆవలి వైపు తొంగి చూస్తే........


నిస్సహాయత, నిర్లిప్తత, నిర్జీవప్రతిమలా. నిరాశా నిసృహల మధ్య నిరంకుశ పద ఘట్టనలతో కుంగిపోతున్న మరో స్త్రీ మూర్తి కనిపిస్తుంది. స్త్రీ ఔన్నత్యం గురించి, ఎన్ని వర్ణనలు చేసినా ఇంకెన్ని చిత్రణలు కావించినా వాస్తవ దృక్పధాన్ని విడిచి పెట్టవద్దు కదా?


మహిళలు అన్ని రంగాలలో అభివృద్ది సాధిస్తున్న ప్రస్తుత నాగరికతా సభ్య ప్రపంచం లో కూడా, ఇంకా మహిళలపై జరిగే మానసిక, శారీరకచిత్రహింసలు, చదివి, విని, చూసి, స్త్రీ యొక్క ఆత్మఘోష విధంగా వుంటుందో, అతివ అంతరంగం ఎంత క్షోభిస్తుందో ఇంకెంత మనస్తాపం చెందుతుందో ..?కుటుంబ పరిస్థితులకు, సంప్రదాయానికి భాధ్యతలకు.మమకారాలకి. ఇలా ఎన్నెన్ని సంకెళ్ళతో బందించ పడుతుందో చెప్పాలనే చిన్ని ప్రయత్నమే

అతివ-అంతర్మధనం .కవిత సంపుటి.

కవితలలో నేను వ్రాసినవన్నీ ఎక్కడో దగ్గర, ఎవరో ఒక స్త్రీ అనుభవిస్తూనే వుంటుంది. అటువంటి అతివలకోసం.

వారిని వేధించేవి వ్యక్తులు కావచ్చు,ఆచారాలు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు.స్త్రీల లోని ఆవేదన ఇంత త్రీవ స్థాయి లో వుంటుందా? అని ఒక్క పురుషుడైనా ఆలోచించి, మహిళల ఆక్రోశాన్ని గ్రహించి, మగువకు కూడా మనసు వుంటుందని, మనిషి గా ఆమె భావాలను గుర్తించి, వ్యక్తిత్వాన్ని గౌరవించితే నా జన్మ ధన్యమైనట్లే భావిస్తాను.

స్త్రీ వేధించబడేది కచ్చితంగా పురుషుడి వలననే ! అది తండ్రి, భర్త, సోదరుడు, కొడుకు, ప్రేమికుడు , స్నేహితుడు ఇంకా దుర్మార్గులుఇలా ఎవరైనా .............?

కవితా సంపుటిలో ప్రతి కవితా ప్రశ్న తోనే ముగుస్తుంది. సగటు స్త్రీ జీవితం ప్రశ్నగా వుండవల్సిందేనా? పరిష్కారం వుందా? మీరు సూచించే పరిష్కారం కోసం ఇదే ఆహ్వానం. కవితలపై మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేస్తారని ఆశిస్తున్నాను.--------------------రేణుకా రాణి .

Tuesday, June 23, 2009

ఒంటరి పోరాటం

"ఒక్క సిరా చుక్క చాలు "
"లక్ష మెదల్లను కదిలించటానికి "అన్నాడు కాలోజి
"ఒక్క అడుగు చాలు "
"వేవేల మైళ్ళు నడవటానికి "అన్నాడు సినా రె
ఒక్క మాట చాలు
ఆవేదన తీరటానికి
ఒక్క చూపు చాలు
కరుణతో కరిగి పోవటానికి
ఒక్క పిలుపు చాలు
హృది వీణను మీటటానికి
ఒక్క కోయిల పాట చాలు
వసంత కాలం రావటానికి
ఒక్క గొంతు చాలు
అన్యాయాన్ని చాటటానికి
ఒక్క దానివి చాలు
ఒంటరి పోరాటం చేయటానికి
అనుకుని ముందుకు నడువు
కోట్ల స్త్రీ సైన్యం నీ వెన్నంటే వుంటుంది
అంటున్నది ఈ శ్రీ రె రా
మధురమైన