Monday, July 13, 2009

సుమంగళి {మూడవ కవిత .అతివ-అంతర్మధనం)

వివాహ బంధమంటే
ఆత్మవంచన ముసుగులో
అభిమానపు అపహాస్యం

నూరేళ్ళ నడకకు
అడుగడుగునా స్పీడు బ్రేకర్లు

మూడుముళ్ల జీవితానికి
నలుగుతున్న అనుబంధం

కన్నపేగు రుణానికి
కాలుతున్న మానవత్వం

సుమంగళిగా మిగలాలని
నడుస్తున్న నిప్పుల కుంపటి

సంస్కరించాలంటే ......................?
అణువణువున అల్లుకుపోయిన
సంప్రదాయపు చితిమంటల్లో
నిత్యాహుతిగా వెలుగుతూ
సమిధలా కాలిపోతూ కూడా
కరిగిపోతున్న బంధానికి ,అడ్డుకట్ట వేసి

త్యాగం,సహనం,అనే ముండ్ల కిరీటంతో
రక్తసిక్తమైన మనసుతో
రగిలిపోతున్నా కూడా

ఆనందాన్ని, సంతృప్తిని
అతికష్టంగా నటిస్తూ
మగడు ఆడిస్తున్న
సంసార రంగస్థలిపై
ఎన్నిరోజులీ నటన..?




2 comments: